Jump to content
  • Sign in to follow this  

    గురించి


    Kondala Rao Palla

    'ప్రజ' లో మొదటి అక్షరం ప్రశ్నను, రెండో అక్షరం జవాబుని సూచిస్తుంది. 'ప్రజ' అంటే 'ప్రజలు' అనే అర్ధం కూడా ఉన్నది.  

    ప్రజ (ప్రశ్న-జవాబుల) ద్వారా ప్రజ (ప్రజల) కు అవసరమైన అన్ని విషయాలలో చైతన్యాన్ని అందించాలనే సత్సంకల్పంతో ఈ చర్చావేదిక పని చెస్తుంది.

    ఎప్పటికీ ఎవ్వరికీ అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉండదు. ప్రతి మనిషికీ జ్ఞానం విషయంలో పరిమితులు ఉండక తప్పదు. అందుకే మనం నిత్య విద్యార్ధులం గా ఉండాలి. నిత్య విద్యార్ధులమని వినయంగా అంగీకరించే అందరికీ ఈ వేదిక హృదయపూర్వక స్వాగతం పలుకుంతోంది.

    ఏదైనా అంశం పై మనకు సమాచారం తెలియాలంటే ఓ ప్రశ్న ద్వారా ఇతరులను అడగవచ్చు. మనకు తెలిసింది ఇతరులకు జవాబు ద్వారా చెప్పవచ్చు. మనకు తెలిసినదానికంటే మెరుగైన సమాచారం ఇతరులనుండి లభిస్తే స్వీకరించవచ్చు. మనకు తెలిసిన జ్ఞానాన్ని మెరుగుపరచుకోవచ్చు. మనం అనుకుంటున్నదానిలో పొరపాట్లు, తప్పులు ఉంటే సరిదిద్దుకోవచ్చు. ఇలా అందరూ కలసి సుహృద్భావమైన చర్చల ద్వారా ఓ విషయాన్ని నిర్ధారించే వీలుంటుంది. 

    'ప్రజ' ద్వారా వివిధ అంశాలపై అంతర్జాలంలో ఉన్న మేధావుల సహకారం తీసుకోవడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి. దీని ద్వారా వివిధ అంశాలపై అవగాహన పెంచుకోవాలనుకుంటున్నవారికీ, చర్చించి నిర్ధారించుకోవాలనుకునేవారికీ ఓ సదవకాశంగా ఈ వేదిక ఉండేందుకు మేధావులు సహకరించాలని, మీ ఖాళీ సమయంలో కొంత భాగం కేటాయించడానికి ప్రయత్నిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాము.

    Sign in to follow this  


    User Feedback

    Recommended Comments

    There are no comments to display.


×