Jump to content

Kondala Rao Palla

సభ్యుడు
  • Content count

    13
  • Joined

  • Last visited

  • Days Won

    1

Kondala Rao Palla last won the day on July 29 2018

Kondala Rao Palla had the most liked content!

Community Reputation

1 Neutral
  1. సెక్షన్ 497 , వివాహేతర సంబందాన్ని సుప్రీం సమర్థించిందా?
  2. సినిమాలు చూసి యువత చేదిపోతున్దోనే విమర్శలు సరైనవేనా? మీ అభిప్రాయం ఏమిటి?
  3. భారత్ ప్రధానంగా వ్యవసాయాధారిత దేశం. పౌరులను ఓటర్లుగా చూసే వ్యవస్థలో రైతు పరిస్తితి దారుణంగా మిగులుతోంది. ఎప్పటినుండో రైతే రాజు అంటూ చెపుతున్నది కేవలం నినాదంగా మాత్రమే మిగిలింది. నిజంగా రైతు రాజు అయ్యేదేపుడు? ఇందుకు పాలనలో, ప్రజలలో, రైతుల ఆలోచనలలో రావలసిన మార్పులు ఏమిటి? ఎవరు ఏమి చేస్తే రైతు పరిస్తితి బాగుపడుతుంది?
  4. ఇటీవల కాలంలో ప్రేమ పెళ్ళిళ్ళను సహించని తండ్రులు ప్రేమికుల పట్ల వ్యవహరించిన తీరు సంచలనం కలిగించింది. ఒక ఘటనలో కూతురు వేరే కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనో.... ఇతర కారణాలు కూడా తోడయ్యో..... తండ్రి ఆమె భర్తను హత్య చేయించాడు. ఈ విషయమై సోషల్ మీడియాలో.... భిన్న ప్రతిస్పందనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఈ ఘటన జరిగిన రెండవరోజే మరో ఘటనలో కూతురు తండ్రి ప్రేమికుల జంటపై హత్యా ప్రయత్నం చేశారు. ఈ ఘటనల సందర్భంగా రాజకీయ నాయకుల ప్రకటనలు జోరందుకున్నాయి. ఎన్నికల వేల కావడంతో మొదటి సంఘటన విషయంలో కూతురుకు అసెంబ్లీ టికెట్ చేయాలనీ విజ్ఞప్తి.
  5. రిజర్వేషన్లనేవి వోటు బ్యాంకు రాజకీయంగా మారాయన్న వాదన నడుస్తోంది. రిజర్వేషన్లు ఇంకెంతకాలం? అన్న వాదన ఉన్నది. రిజర్వేషన్లు రద్దు చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు వర్తింపజేయాలన్న వాదానా నడుస్తోంది. రిజర్వేషన్ల అమలులో క్రీమీలేయర్ పద్ధతిని అవలంబించాలన్న డిమాండ్ చేస్తున్నవారున్నారు. అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరన్న వాదన ఉన్నది. కులపరమైన రిజర్వేషన్లు కాకుండా ఆర్ధికపరమైన రిజర్వేషన్లు ఇవ్వాలని సూచిస్తున్నవారూ ఉన్నారు. కుల సమస్య ఉన్నంత వరకూ రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్ చూస్తున్నాము. కొన్ని రంగాలలో అసలు రిజర్వేషన్లు ఉంచకూడదని అనేవారూ ఉన్నారు. ఇలా రకరకాల వాదనలు ఉన్నాయి. రిజర్వేషన్ల విషయమై మీ అభిప్రాయం ఏమిటి?
  6. Kondala Rao Palla

    గురించి

    'ప్రజ' లో మొదటి అక్షరం ప్రశ్నను, రెండో అక్షరం జవాబుని సూచిస్తుంది. 'ప్రజ' అంటే 'ప్రజలు' అనే అర్ధం కూడా ఉన్నది. ప్రజ (ప్రశ్న-జవాబుల) ద్వారా ప్రజ (ప్రజల) కు అవసరమైన అన్ని విషయాలలో చైతన్యాన్ని అందించాలనే సత్సంకల్పంతో ఈ చర్చావేదిక పని చెస్తుంది. ఎప్పటికీ ఎవ్వరికీ అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉండదు. ప్రతి మనిషికీ జ్ఞానం విషయంలో పరిమితులు ఉండక తప్పదు. అందుకే మనం నిత్య విద్యార్ధులం గా ఉండాలి. నిత్య విద్యార్ధులమని వినయంగా అంగీకరించే అందరికీ ఈ వేదిక హృదయపూర్వక స్వాగతం పలుకుంతోంది. ఏదైనా అంశం పై మనకు సమాచారం తెలియాలంటే ఓ ప్రశ్న ద్వారా ఇతరులను అడగవచ్చు. మనకు తెలిసింది ఇతరులకు జవాబు ద్వారా చెప్పవచ్చు. మనకు తెలిసినదానికంటే మెరుగైన సమాచారం ఇతరులనుండి లభిస్తే స్వీకరించవచ్చు. మనకు తెలిసిన జ్ఞానాన్ని మెరుగుపరచుకోవచ్చు. మనం అనుకుంటున్నదానిలో పొరపాట్లు, తప్పులు ఉంటే సరిదిద్దుకోవచ్చు. ఇలా అందరూ కలసి సుహృద్భావమైన చర్చల ద్వారా ఓ విషయాన్ని నిర్ధారించే వీలుంటుంది. 'ప్రజ' ద్వారా వివిధ అంశాలపై అంతర్జాలంలో ఉన్న మేధావుల సహకారం తీసుకోవడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి. దీని ద్వారా వివిధ అంశాలపై అవగాహన పెంచుకోవాలనుకుంటున్నవారికీ, చర్చించి నిర్ధారించుకోవాలనుకునేవారికీ ఓ సదవకాశంగా ఈ వేదిక ఉండేందుకు మేధావులు సహకరించాలని, మీ ఖాళీ సమయంలో కొంత భాగం కేటాయించడానికి ప్రయత్నిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాము.
×