దేవుడా? దేవుల్లా?

Kindly, share your thoughts and views?

1 Like

ఒక దేవుడు లేదా అనేక దేవుళ్ళు వున్నారనడానికి శాస్త్రీయ ఆధారాలేవీ లేవు.

వ్యక్తిగతంగా నేను మనల్ని నడిపించే శక్తిని ‘దేవుడు’ అని పిలిస్తే తప్పుబట్టను. ఆత్మసాక్షిగా మనస్సులను క్రమమైన పద్ధతిలో వుంచుకోవడానికి ఒక శక్తిని నమ్ముతూ ఆరాధిస్తే తప్పులేదనుకుంటాను.

తెలుగు రాష్ట్రాల్లోనే గమనిస్తే అనేక గ్రామాలకు ప్రత్యేకించి గ్రామ దేవతలున్నారని నమ్ముతారు. వివిధ మతాలను పాటించే వ్యక్తులు వివిధ రకాలుగా దేవుడని పిలుస్తారు. హిందూ మతంలో అనేక మంది దేవతలు/దేవుళ్ళున్నారు. ముస్లింలు అల్లా అని, క్రిస్టియన్లు ఏసు అని నమ్ముతారు. ఇవన్నీ వ్యక్తిగత నమ్మకాలు.

శాస్త్రీయంగా విశ్వం ఏర్పడడానికి కారణాలు అనేక చర్య-ప్రతిచర్యల మూలాన అని చెప్పగలుగుతున్నారు కానీ, ఆ చర్యలు-ప్రతిచర్యలకు మూలకారణాన్ని నేటివరకు కనుగొనలేకపోయాము.

1 Like

మనిషి మనసులోనే అంటే నీలోనే దైవత్వం ఉంటుంది. రాక్షసత్వం కూడా ఉంటుంది. ఏది? ఏ పరిస్థితులలో? ఎలా ఉండాలి? లేదా ఉంచుకోవాలి? ఎలా ఉంటున్నావు? అన్నదే ముఖ్యం. దీనికి నీలో నీవు మార్పు తెచ్చుకోవడం ముఖ్యం.

దేవుడుకి ఆకారం సృష్టించింది తన అవసరాలకోసం మనిషి మాత్రమే.

దేవుడు లేడని వాదించడం అనవసరం. ఉన్నాడన్నది ఒక నమ్మకం మాత్రమే. అది నమ్మకంగా ఉన్నంతవరకూ ఇబ్బంది ఉండదు. ఉన్మాదంగా మారితే ప్రమాదం.

1 Like