ప్రస్తుత పరిస్థితులలో ఆలయాలు, సచివాలయాలు, రాజధానుల నిర్మాణం సమంజసమేనా?

ప్రస్తుత పరిస్థితులలో ఆలయాలు, సచివాలయాలు, రాజధానుల నిర్మాణం సమంజసమేనా?

వాట్సాప్ లో ఓ అంశం ప్రముఖంగా చక్కర్లు కొడుతోంది.

దాని సారాంశం : ప్రధాని రామాలయం , కేసీయార్ సచివాలయం, జగన్ 3 రాజధానులు నిర్మాణం చేస్తున్నారు. ప్రజలు మాత్రం ఆసుపత్రులలో రోగాలకు లక్షలలో బిల్లులు కడుతున్నారు.

ఇది ఖచ్చితంగా ప్రత్యర్ధులు సంధించే విమర్శ అనేది నిర్వివాదాంశం. అయితే ఎవరు కడుతున్నారు? ఎందుకు కడుతున్నారు? ఎవరి సొమ్ముతో కడుతున్నారు? అనేదీ ముఖ్యమే. పాలకులు వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేదీ ముఖ్యమే.

పాలన ఎలా ఉండాలి? అనేది దృష్టిలో ఉంచుకుని పాలకులను ఆలోచింపజేసే విధంగా మీ అభిప్రాయం తెలుపగలరు.

1 Like

రేపటి ఎన్నికల వైకుంఠపాళి ఆటకు ఇప్పటి నుండే అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న రాజకీయం…ఏ కరోనా ఐతే మాకేంటి… మిగిలిన వాళ్ళతోనే మా ప్రయాణం…

3 Likes

కేంద్ర బడ్జెట్ లో రామాలయానికి కేటాయించిన నిధులు, రాష్ట్ర బడ్జెట్ లో సచివాలయానికి కేటాయించిన నిధులెంత? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుచేసే సంక్షేమ పథకాలు, కాంట్రాక్టులలో జరిగే అవినీతితో పోలిస్తే ఇవి ఏ చివరికి?

నా ఉద్ధేశ్యం రామాలయాన్ని, సచివాలయాన్ని సమర్థించడంకాదుగానీ, ఈ విషయాలు ప్రజలలో ఇంత ప్రాముఖ్యత పొందేంత ఆవశ్యమైనావా? కావని నా అభిప్రాయం.

పాలన అన్ని రంగాలలో సమంగా, సమర్థవంతంగా వుండాలి. ప్రస్తుత ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యంగా లోపించినవి సమర్థత, పారదర్శకత, ప్రాముఖ్యత మరియు జవాబుదారీతనం. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు తెలిసేలా, ప్రజల సూచనలను ప్రోత్సహించేలా, ఆ సూచనలను పరిగణలోకి తీసుకునేలా పాలన వుంటే బావుంటుంది.

1 Like