నిత్య చైతన్య స్ఫూర్తి జాతీయ పతాకం

అదొక ఉత్తుంగ తరంగం
అదొక సప్త సముద్ర ఘోష
అదొక సప్త ఖండాంతర క్షిపణి
అదొక అష్ట దిక్కుల కాంతి పుంజం
అదొక పాంచజన్య శంఖారావం
అదొక అఖండ రుద్ర తాండవం
అదొక నిర్ద్వంద్వ ప్రణవ నాదం
అదొక చైతన్యార్ణవ జాతీయ భావం
అదొక మహోజ్వల తిరంగ తారంగం
అదొక విశ్వాద్భుత సంగీత స్వరం
అదొక శత్రుభయంకర సింహనాదం
అదొక కాలాలను జయించిన సమ్మోహనం
అదొక హృదయాలను జయించిన ప్రేమామృతం
అదొక స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు శాశ్వత చిహ్నం…
అదొక జాతిని ఏక తాటిపై నిల్పిన మంత్రం…
అదే జాతీయ పతాక రెపరెపల సవ్వడి…

అట్లూరి వెంకటరమణ
కవి, రచయిత ఖమ్మం
9550776152

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా…

2 Likes

జాతిపతాకకు చెప్తున్నా 'జైహింద్`.

ఉత్తుంగ = పొడవైనది

పాంచజన్య = విష్ణువు యొక్క శంఖము

ప్రణవ = ఓంకారము

ఈ పదాలకు అర్థం తెలుసుకున్నానండీ మీ కవితవల్ల! బాగుంది.

1 Like