'వికాసం' అంటే ఎలా నిర్వచిస్తారు?

‘వికాసం’ అనే పదాన్ని ఎలా నిర్వచిస్తారు?

ఏది వికాసవంతమైన జీవితం?

వికాసంతో ‘కూడని’ జీవితం ఎలా వుంటుంది?

1 Like
  1. ఈ అనంతవిశ్వంలో మీ వంటి వ్యక్తి మరొకరు ఇదివరకు లేరు అలాగే రాబోయే తరాల్లో ఉండబోరు. మీరు ఒక స్వచ్చమైన, అరుదైన వారు. మీలోని ఆ ప్రత్యేకతను ఆనందమయంగా అనుభవించండి.

  2. జీవితంలో మనమందరము విజయవంతంగా ఉండాలని కోరుకుంటాము.విలాసవంతమైన మరియు ఎంతో ధనవంతమైన జీవితమొక్కటే విజయవంతమైన జీవితము కాదుకదా! శారీరకమైన సమస్యలు ఉంటె మనము ఎంతటి ధనవంతులైతే మాత్రం ఏం ప్రయోజనం! ఈ సందర్భంలో విలాసాలను మరియు ధనాన్ని ఏం చేసుకోగలం? చాలా సందర్బాలలో మన జీవితంలో సగ భాగం సమయాన్ని ధనాన్ని సంపాదించేందుకు ఉపయోగిస్తే, మిగతా సగ భాగం సమయాన్నిఅదే ధనాన్ని ఖర్చు పెట్టి మనము కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందేదుకు అవస్థలు పడుతూ చూస్తూ ఉంటాము. దీన్ని మనము విజయమనుకుంటే అది పొరబాటు.

మనము ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ పరిస్థితిని ఇబ్బందిపడని విధంగా, ఎంతో ఓర్పుతో, సహనంతో,ఆనందంగా ఎలా అధిగామించగలం! అలాగే ఆ సందర్భాన్ని మనకు ఒక అవకాశంగా ఎలా మలచగలం! నిజమైన విజయమంటే ఇదే! ఆర్ట్ అఫ్ లివింగ్ ప్రక్రియలు ఇలాంటి మార్పులనే మనలో తీసుకురాగల ఒక పద్ధతి.
మనము మన జీవితంలో ఎంత తొందరగా యోగ, ప్రాణాయామం మరియు ధ్యానము మొదలైన ఉపాయాలను తీసుకురాగాలమో మనము అంతే తొందరగా విజయాలకు నాంది పలికినట్లు!

1 Like

బుద్ధి, జ్ఞానంలను నిరంతరం అభివృద్ధి చేసుకోవడం ద్వారా మనిషి తన ప్రవర్తనను మెరుగుపరచుకోవడంను వికాసం గా చెప్పవచ్చు.

1 Like