జర్నలిజంలో విలువలు దిగజారడానికి కారణాలు ఏమిటి?

జర్నలిజంలో విలువలు దిగజారడానికి కారణాలు ఏమిటి?

జర్నలిజంలో గతంతో పోల్చితే విలువలు దిగజారుతున్నాయనేది నిర్వివాదాంశం. ఇప్పటికీ సమాజహితం కోసం తపించి ప్రాణాలను సైతం లెక్కజేయకుండా పనిచేస్తున్న జర్నలిస్టులు దీనికి మినహాయింపు.

గతంతో పోలిస్తే పత్రికల సంఖ్య, పాఠకుల సంఖ్య పెరిగింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్, డిజిటల్ మీడియాలతో పాటు సోషల్ మీడియా కూడా అందుబాటులోకి రావడం ఆహ్వానించదగిన పరిణామమే అయినా ఇపుడు ఏది వార్తో, ఏది కాదో, ఏది ఎవరికి అవసరమో, ఏ మీడియా ఎవరి ప్రయోజనాలకోసం పనిచేస్తున్నదన్నది పెద్ద ప్రశ్న. చదువరులకు ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోవడానికి ఒక్క పత్రికనో, చానల్ నో చదివితేనో, చూస్తేనే సరిపోయే పరిస్తితి లేదు. మీడియా పెద్ద వ్యాపారంగా మారింది. జర్నలిస్టులు చాలా వరకు ఎర్నలిస్టులుగా మారారు. సమాజంలో బ్యూరోక్రాట్లతో పాటు మీడియా వారి బ్లాక్ మెయిలింగ్ బాధలూ ఎక్కువవుతున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలలో అక్రమాలు బయలు పడకుండా ఉండడానికి మీడియాకి కొంత పర్సంటేజిని కేటాయిస్తున్నట్లు వినికిడి. ఈ నేపథ్యంలో మీడియాలో విలువలు దిగజారడానికి కారణాలు, మీడియాను బాగుజేసుకోవడానికి తీసుకోవలసిన చర్యలపై మీ అభిప్రాయాలను తెలియజేయగలరని విజ్ఞప్తి.

1 Like

త్వరగా ధనవంతులు కావాలి అనే అతి ఆశ

1 Like

వ్యాపారాత్మక యాజమాన్య ధోరణి…

2 Likes

వ్యాపార విధానాల్లో వచ్చిన అనేక మార్పులవల్ల జర్నలిజం చిన్నాభిన్నమైనదని నేను అభిప్రాయపడతాను. టెలివిజన్ల మొదలు, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ల వాడకం అనేకరెట్లు పెరగడంతో అప్పటివరకూ ప్రింట్ మీడియాలోనే ఆధిపత్యం చలాయించిన జర్నలిజం అనివార్యంగా ఇతర రంగాలకు విస్తరించింది.

ప్రింటు మీడియా వ్యాపార విధానాలకు, టెలివిజన్ / స్మార్ట్ ఫోన్ ద్వారా వార్తలు/విశ్లేషనలు అందుబాటులోకి తీసుకువచ్చే మాధ్యమాల వ్యాపార విధానాలకు అనేక వ్యత్యాసాలున్నాయి. ఇప్పటి డిజిటల్ మాధ్యమాలతో పోల్చుకుంటే ప్రింట్ మీడియా నిర్వహణకయ్యే వ్యయం ఈ రోజుకూ చాలా తక్కువ. కానీ, ప్రింటు మీడియా కన్నా డిజిటల్ మీడియా చాలా వేగంగా, ఎక్కువ సంఖ్యకు తక్కువ సమయంలో సులభంగా సమాచారాన్ని అందజేయగలుగుతుంది. ప్రాంతబేధాలతో సంబంధంలేకుండా సులభంగా సమాచారాన్ని అందజేయడంలో డిజిటల్ మీడియా సఫలమయింది. ప్రింటు మీడియా విలువ అనివార్యంగా తగ్గుతూ వచ్చింది.

ఈ మార్పులో జర్నలిజం కూడా విలువను కోల్పోయిందన్నది వాస్తవం. దీనికి ప్రధాన కారణంగా ఆయా మాధ్యమాల వ్యాపార నిర్వహణనే నేనభిప్రాయపడతాను. ఒక టీవీ ఛానల్ ను పోటీగా, నిలదొక్కుకునేలా నిర్వహించడానికి కావలసిన పెట్టుబడి కేవలం చందాలు / వ్యాపార ప్రకటనలద్వారా సమకూరడంలేదు. పెయిడ్ ప్రోగ్రామ్స్ అనేకం! ఇండిపెండెంట్ / స్వేచ్ఛగా వార్తావిశ్లేషణలు ప్రచురించడానికి సిద్ధంగా వున్న ఛానళ్ళు / పత్రికలెక్కడ? నిజంగా ప్రచురిద్దామనుకున్నా అనుకూలించే రాజకీయ పరిస్థితులున్నాయా?

గత 5 సంవత్సరాలలో భారతదేశం ఇంటర్నెట్ వినియోగంలో అనేక రెట్లు అభివృద్ధి చెందింది. గ్రామీణ ప్రాంతాలకు సైతం వేగవంతమైన వైర్-లెస్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. అనేక ఇండిపెండెంట్ జర్నలిస్టులు, సోషల్ యాక్టివిస్టులు యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా వారి విశ్లేషనలందిస్తూ, ఆర్థికంగా సైతం నిలదొక్కుకోగలిగే పరిస్థితులేర్పడుతుండడం శుభపరిణామం. ఈ డిజిటైజేషన్ వల్ల ఒకరకంగా ప్రస్తుత జర్నలిజం కాస్త మెరుగవుతున్నట్లేలెక్క!

ఇకపోతే మీడియాను బాగుజేసుకోవడానికి కుదిరే పరిస్థితులు ప్రస్తుతమున్న వ్యాపారవిధానాలతో సాధ్యమవ్వకపోవచ్చు. ఇండిపెండెంట్ జర్నలిజానికి బాటలే జర్నలిజాన్ని తిరిగి నిలబెట్టగలవని నా నమ్మకం. వారు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగేలా యూట్యూబ్, లిబరాపే లాంటి మాధ్యమాల వినియోగం పెరిగితే మంచిది.

3 Likes