మహా విశ్వంలో మన భూమి ఎలా పుట్టింది?

మహా విశ్వంలో మన భూమి ఎలా పుట్టింది?

ఈ విషయమై మనకు వచ్చే సందేహాలు, వాటికి వచ్చే సమాధానాలు రకరకాలుగా ఉన్నాయి.

చిన్న పిల్లలు పెద్దలను అడిగితే వారి కి తెలిసిన మతపరమైన పురాణ కథలు చెప్పవచ్చు.

అదే పెద్దలు చదువుకున్నవారు అయితే భూమి గోళంగా ఎలా రూపుదిద్దుకున్నది వివరించే ప్రయత్నం చేస్తారు.

చిన్నపిల్లలు ఇప్పుడు ఇదే ప్రశ్న మిమ్ములను అడిగితే వారికి అర్థమయ్యే రీతిలో తేలికపాటి మాటలతో సరైన సమాధానం గా మీరేం చెప్తారు?

మీ అమూల్యమైన అభిప్రాయాన్ని పంచుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

1 Like

పదార్థ రూపంలో… గ్రహం గా పిలవబడే‌ భూమి సమస్త వనరులకు వేదిక… నివాసయోగ్యమైన ఒకే ఒక ప్రాంతం…

1 Like

జనవిజ్ఞాన వేదిక వారి సమాధానం (ప్రొఫెసర్ ఎ.రామచంద్రయ్య, NIT వరంగల్) ప్రకారం[1]:

భూమి పుట్టలేదు. ఏర్పడింది. ఆధునిక విశ్వ సిద్ధాంతాల (cosmology) ప్రకారం సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఒక మహా విస్ఫోటం (big bang) ద్వారా శక్తి రూపాంతరం చెంది విశ్వం (universe)గా మారింది. ఆ విశ్వం క్రమేపీ విస్తరిస్తున్న క్రమంలో నెబ్యులాలు అనే మేఘాలుగా పదార్థం క్రోడీకరించుకుంది. ఆ నెబ్యులాలే నక్షత్ర రాశులుగా మారాయి. ప్రతి నక్షత్రం మొదట్లో ఓ వాయు అగ్ని పళ్లెంలాగా ఏర్పడింది. అలాంటిదే సుమారు 600 కోట్ల సంవత్సరాల క్రితం సౌరమండల పళ్లెం (solar disc) రూపుదిద్దుకుంది. అది తన చుట్టూ తాను తిరిగే క్రమంలో అపలంబ బలం(centrifugal force) వల్ల అంచుల్లో ఉన్న ద్రవ్యం గ్రహాలుగా, మధ్యలో భాగం సూర్యుడిగా మారాయి. కాబట్టి భూమి కూడా ఆ సౌరమండల పళ్లెంలో ఒక భాగమే. అంటే భూమి, సూర్యుడు కూడా సోదరులు మాత్రమే. భూమి వయస్సు సుమారు 550 కోట్ల సంవత్సరాలు. ఇది కూడా మొదట్లో సూర్యుడిలాగే స్వయం ప్రకాశకం(self luminiscent). కానీ కేంద్రక సంలీన(nuclear fussion)కు కావలసిన ఉదజని (హైడ్రోజన్‌) తొందరగా ఖర్చు కావడం వల్ల అగ్ని ఆగిపోయి చల్లబడి క్రమేపీ ప్రస్తుత స్థితికి చేరుకుంది.


చిన్నపిల్లలకు అర్థమయ్యేలా భూమి ఆవిర్భావం గురించి ‘సరైన సమాధానం’ ఇవ్వడం సాధ్యమేనా?

ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.

దేవుడు లేకుండా ఏమీ జరగదు…

దేవుడు అనాగా సృష్టికర్త.

సృష్టికర్త ఆవిర్భావానికి దారితీసిన పరిణామాలే రహస్యంగా వున్నాయి.

దేవుడు లేకుండా ఏమీ జరుగదు… అనుకుంటే నాదో సందేహం…పాపాలు, ప్రమాదాలు, అకృత్యాలు, దుర్మార్గాలు, దారుణాలు… ఇవన్నీ కూడా దేవుడే చేయిస్తున్నాడా? దేవడు ఇలా ఎందుకు శాడిస్టుగా ఉంటాడు? ఉంటే అలాంటివాడు దేవుడు ఎలా అవుతాడు?