మీ ఫోన్ / కంప్యూటర్ లో తెలుగు టైపింగ్ ఎలా చేస్తున్నారు? అందులో మీకెదురయ్యే ఇబ్బందులేవి?

మీ ఫోన్ / కంప్యూటర్ లో తెలుగు మీరెలా టైప్ చేస్తున్నారు? చాలామంది ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే గూగుల్ కీబోర్డు, గూగుల్ ఇండిక్ కీబోర్డు, ఇండిక్ కీబోర్డు లాంటివి, కంప్యూటర్లో అయితే పాత డి.టి.పి. రంగంలో వున్నవారు యాపిల్ కీబోర్డు, కొత్తగా నేర్చుకునేవారయితే ఇన్-స్క్రిప్టు, యాపిల్ (యూనికోడ్ వి), లేఖిని వంటి లిప్యంతరీకరణ ప వాడుతుండవచ్చు. తాజాగా వాయిస్ టైపింగ్ కూడా ఆదరణ పొందుతున్నది. అయినా, వీటన్నింటి వాడుకలో వేటికివాటికే ఇబ్బందులెదరవుతూ వుంటాయి.

  • టైప్ చేసేప్పుడు మీకున్న ఇబ్బందులేవి?
  • మీరెలా టైప్ చేస్తున్నారు? పై సాఫ్టువేర్ కాకుండా వేరే మార్గాలేవైనా వాడుతున్నారా?
  • ఏ కీబోర్డు మీకు సులభంగా అనిపిస్తుంది? ఎందుకు?

ఈ టాపిక్ ఉద్దేశం అనేక సమస్యలను, వాటి పరిష్కారాలను చర్చించి అధిగమించడానికి ప్రయత్నం చేయడమే!

పోల్: ఇంతకీ, మీరెలా టైప్ చేస్తున్నారు?

  • గూగుల్ కీబోర్డు (Gboard / Indic)
  • గూగుల్ / ప్రముఖ్ / లేఖిని / ఇండిక్ కీబోర్డు (లిప్యంతరీకరణ = English to Telugu)
  • యాపిల్ (యూనికోడ్) / యాపిల్ (అను)
  • ఇన్-స్క్రిప్ట్ (యూనికోడ్)

0 voters

1 Like