వ్యవహారిక తెలుగులో మహాభారతం చదివారా? ఏ పుస్తకం?

చిన్నప్పుడు మా ఇంట్లో మహాభారతం వ్యవహారిక భాషలో ఒక పుస్తకం ఉండేది. తర్వాత ఏమైందో కనిపించలేదు. చాలాసార్లు చదువుదామని ఇంటర్నెట్లో వెతికాను కానీ సరైన పుస్తకం కనిపించలేదు.

మీరు మహాభారతం చదివారా? చదివితే ఏ పుస్తకం? ఆడియో బుక్ అయినా ఫర్వాలేదు కానీ సరళంగా, పూర్తిగా, వీలైనంత తక్కువ వివాదాలతో కూడుకున్నదై ఉంటే చాలు.

1 Like

At the outset i wish to state that I haven’t read neither Gita nor Mahabharatha but heard many snippets of both Gita and Mahabharatam from authentic sources only, but still i wish to recommend (though not proper but in reply to the good question) you may read Bhagavad Gita which itself is voluminous and contains every aspect of life & how to lead life than that of Mahabharata (complete one) which is approximately 20 times of Gita.

గీతా సారాంశమూ మహాభారతంలోదేకనుక మహాభారతం చదివితే ప్రత్యేకించి గీత చదవాల్సినపనిలేదుకదా! మహాభారతం భారీ గ్రంథమే, కానీ నాకు చదవాలనుంది. మీలాగే అనేక భాగాలు అనేక సందర్భాలలో విన్నాను / చదివాను. ఉదాహరణకు పాఠశాలలో నేర్చుకున్న శాంతనుడి కథ, జనమేజయుని యాగం, దానవీరశూరకర్ణ సినిమా వంటి మూలాలద్వారా.

యూట్యూబ్ లో కొన్ని ఛానళ్ళు తెలుగులోనే మహాభారతాన్ని అందుబాటులో వుంచాయి కానీ అవెంతవరకు బాగున్నాయో తెలియదు. ఉదాహరణకు: https://www.youtube.com/watch?v=ypQ10sAl_7I&t=1796s

1 Like