ఆలస్యం అమృతం విషం, నిదానమే ప్రధానం ? ఈ సామెతలలో ఏది సరైనది? ఎలా?

ఆలస్యం అమృతం విషం, నిదానమే ప్రధానం ? ఈ సామెతలలో ఏది సరైనది? ఎలా?

ఏ జాతీయమయినా సందర్భావసరములనుబట్టి తరతరాలుగా రూపొందుతూ వచ్చినవే. ఇక్కడ వుంచిన జాతీయము కూడా సందర్భాన్ని బట్టి భావం మారే విధంగా వుంది. ఉదాహరణకు ‘ఆలస్యం అమృతమూ అవ్వొచ్చు, విషమూ అవ్వొచ్చు’ అనేది ఒక సందర్భంలో వాడవచ్చు. మరొక సందర్భంలో ‘ఆలస్యంవల్ల అమృతం కూడా విషమవ్వొచ్చు’ అని వాడవచ్చు.

అలాగే, ‘నిదానమే ప్రధానం’ అను నానుడి కూడా సందర్భాన్ని బట్టే భావాన్నిస్తుందని అభిప్రాయపడతాను. కొన్నసార్లు మనం చేసే పనులలో స్పష్టత లోపించడమో, హడావుడిగా/కంగారుగా పనిచేయడమో జరుగుతుంటుంది. అలాంటి సందర్భాలలో నిదానంగా పనిచేస్తే బాగుంటుందని వాడవచ్చు. అలాగే, ఈ నానుడిని తరచూ రవాణా శాఖ వారి ప్రచారాల్లో కూడా చూస్తుంటాం. వారి సందర్భాలు వేరు.

ఈ రెండు సామెతల్లో ఏది సరైనది అనేకంటే, ఏ సందర్భంలో ఏ సామెత సరైనది అనే ప్రశ్న ఉత్తమమని నా భావన. ఇదివరకు సాక్షి పత్రిక వారి ‘ఫన్ డే’ మేగజైన్లో అనేక జాతీయాల పుట్టుక, వాటిని వాడే సందర్భాలతో ప్రతివారం ప్రచురించేవారు. వాటన్నింటినీ కలిపి ఒక పీడీఎఫ్ ప్రతిగా ఇక్కడ వుంచాను. ఆసక్తి వున్నవారు గమనించగలరు.

3 Likes